Logo
Date of Publish : 02 December 2023, 9:53 pm
Editor : Sake Naresh

రూ.కోట్లాది రూపాయల గ్రావెల్ ను దోచేస్తున్నారు

  సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ నందు అక్రమ గ్రావెల్ రవాణాతో ఏర్పడిన గ్రావెల్ గుంటలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ ను వైసిపి నాయకుల కనుసన్నలలో గ్రావెల్ మాఫియా గ్రావెల్ దందా కొనసాగిస్తుంది. ఇప్పటివరకు దీనిపైన గనుల శాఖ గాని, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం మంత్రి అండదండలతో వైసిపి నాయకుల ఆగడాలకి అడ్డు అప్పు లేకుండా ఉంది. ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు ఏవైనా సరే పరిమితులకు మించి గుంటలను లోడితే ఎందుకు వాళ్లపై తగిన చర్యలు తీసుకోలేదు. గ్రామాలకి 50 మీటర్ల దూరంలో ఇంత పెద్ద గుంటలు వున్నాయి. వర్షపు నీటితో నిండిపోతే చిన్నపిల్లలు, వృద్ధులు, నోరులేని జంతు జీవాలు ఇందులో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మేము ప్రభుత్వా అధికారులనీ, ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం. గ్రావెల్ గుంటల దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టండి. రక్షణ వలయాలని ఏర్పాటు చేయండి. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడొద్దు. మీరు దోచుకున్న, దాచుకున్న ప్రతి ఒక్కదానికి 2024 తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంలో లెక్కలు కట్టించి మీరు తిన్న దాన్ని తిరిగి కక్కిస్తాం. ఇందుకు కారకులైన వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుంటాం. అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, చెంచయ్య, రహీం, అశోక్, సుధాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com