శ్రీకాళహస్తి ( జనస్వరం ) : చిందేపల్లి గ్రామం రోడ్డు సమస్య కోసం పోరాటం చేసిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారి పైన, జనసైనికులు , గ్రామస్థులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇందులో 6 మందిని 29 మార్చ్ నాడు రిమాండ్ పంపడం జరిగింది. రిమాండ్ లో ఉన్న 6 మందికి తిరుపతి జిల్లా కోర్ట్ నందు బైలు మంజూరు అయ్యింది. ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారికి హైకోర్ట్ నందు ఈ కేసులో ఊరట లభించింది. మరో 13 మంది (వినుత గారి భర్త కోటా చంద్రబాబు, తల్లిదండ్రులు, జనసైనికులు, గ్రామస్థులకి) కి అక్రమ కేసు నుండి ఉపశమనం కొరకు న్యాయపోరాటం కొనసాగుతుంది. రిమాండ్ నుండి విడుదల అయిన జనసైనికులకు నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు, జనసైనికులు మంగళ హారతులతో ,పూలమాల వేసి బయటకి తీసుకుని రావడం జరిగింది.జనసేన పార్టీ తరఫున, గ్రామ ప్రజల తరఫున పోరాడి ఇబ్బందులు పడ్డ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. రిమాండ్ లో ఉన్న వారి బైలు కోసం నిరంతరాయంగా కృషి చేసిన లాయర్ శ్రీమతి కంచి శ్యామల గారిని గౌరవిస్తూ, సత్కరించడం జరిగింది. చిందేపల్లి ఘటనలో పూర్తి స్థాయిలో అండగా ఉండి ధైర్యం నింపిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అన్ని విధాలుగా అండగా నిలబడ్డ జిల్లా అధ్యక్షులు Dr. పసుపులేటి హరి ప్రసాద్ గారికి , జనసేన లీగల్ విభాగానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియేస్తున్నాం. అనంతరం అంబేడ్కర్ జయంతి సందర్భంగా వినుత కోటా గారు జనసైనికులతో కలిసి వెళ్లి శ్రీకాళహస్తి పట్టణంలో బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.