Logo
Date of Publish : 28 January 2024, 7:13 pm
Editor : Sake Naresh

శ్రీశ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

     తిరుపతి ( జనస్వరం ) :  కవిత్వం, జానపదం రెండూ జాతి అభ్యున్నతికి జీవనాడులని ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ అన్నారు. శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లాశాఖ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హల్లో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ మార్గనిర్దేశనంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, గుత్తా హరి సర్వోత్తమ నాయుడు పర్యవేక్షణలో, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సంక్రాంతి సాహిత్య, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కవిసమ్మేళనం, జానపద గేయాలాపన కార్యక్రమాన్ని వైభవంగా సాగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అనేకమంది కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు సభకు శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అధ్యక్షత వహించారు. ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవిత్వానికి సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వుందన్నారు. జానపదం అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపి సమసమాజ స్థాపన చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న జానపద సంపదను పరిరక్షించేందుకు శ్రీశ్రీ కళావేదిక ద్వారా కృషి చేస్తున్నామన్నారు.

పలువురు కవులు, కళాకారులకు ఘన సన్మానం :

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రచయితలు, కవులు, కళాకారులను ఈ సందర్భంగా ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ సత్కరించారు. తిరుపతి జిరసం వ్యవస్థాపక అధ్యక్షులు సాకం నాగరాజు, సుప్రసిద్ధ నవలా రచయిత వి.ఆర్. రాసాని తదితరులు కవి సమ్మేళనం జానపద కళాకారులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ జానపద కళాకారుడు రెడ్డెప్ప, యువశ్రీ మురళి, డా. బత్తల అశోక్ కుమార్, ఆకుల మల్లేశ్వర రావు, సి. నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com