
రాజాం ( జనస్వరం ) : రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు(యు.పి.రాజు) ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం బొబ్బిలి రోడ్ సిరి కల్యాణమండపం పక్కన జనసైనికులు సమక్షంలో ప్రతేక పూజలతో కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ కార్యాలయంకి విచ్చేసి సమస్యలు తెలియజేసిన యెడల సమస్యలును పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసిన అభ్యర్థినీ గెలిపించి రాజాం నియోజకవర్గం బహుమతిగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామని అలాగే ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, రెడ్డి బాలకృష్ణ, నమ్మి దుర్గారావు, లక్షుమనాయుడు, జగదీశ్, జయకృష్ణ, సింహాచలం రామకృష్ణ అనుదీప్ ఈశ్వర్ మరియు జనసైనికులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.