Logo
Date of Publish : 05 July 2022, 4:19 pm
Editor : Sake Naresh

ఘనంగా ముదినేపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలు

          కైకలూరు ( జనస్వరం ) : నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు  బండ్రేడ్డి రామకృష్ణ విచ్చేసారు. ముదినేపల్లి సెంటర్ నుండి భారీ ర్యాలీగా బండ్రేడ్డి రామ్ కు స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్రగా గురజ రోడ్ లోని ప్రభుత్వ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంకి భారీ జనసమూహంతో వెళ్లారు. వేదపండితుల మధ్య కార్యాలయంని ప్రారంభించారు. రామ్ మాట్లడుతూ కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి మండలం ఎంతో ప్రటిష్టత్మాకమైన మండలమని, వీరు చేస్తున్న సేవ కార్యక్రమాలు, ప్రజల్లోకి జనసేన పార్టీ తీసుకుని వెళ్ళాలి అని ఆలోచన బలంగా ఉంది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం కచ్చితంగా జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు(వెంకయ్య) మాట్లడుతూ మన మండలంకి తను మరియు జనసేన పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము అని ఈ యొక్క కార్యాలయం మాకోసం కాదు, ప్రజా సమస్యలు తెలుసుకోడానికి, ప్రజలకు మరింత అందుబాటులో ఉండడానికే అని తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క సమస్యలు తప్పకుండా పార్టీ కార్యాలయంకి తెలపవలసిందిగా కోరారు. రాబోయే ఎలక్షన్లో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ఆయనని కూడా చూడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికి చీరలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com