Logo
Date of Publish : 24 July 2026, 11:57 pm
Editor : Sake Naresh

కలివెలపాలెంలో ఘనంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్

నెల్లూరు, జూలై 24 (జనస్వరం): నెల్లూరు రూరల్ పరిధిలోని కలివెలపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలివెలపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు వెండిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వెండిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారి అభివృద్ధిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. పిల్లల చదువు, ప్రవర్తనపై ఉపాధ్యాయులకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, తల్లిదండ్రులు తరచూ ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com