Logo
Date of Publish : 03 September 2022, 4:07 pm
Editor : Sake Naresh

ధర్మవరంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

             ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కొత్తపేట నందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందాలని పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న "నా సేన కోసం నా వంతు" కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చిలకం మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి వారి ఖాతాల నుండి పార్టీ ఖాతాకు విరాళం ప్రకటించి జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకుల అడ్డగిరి శ్యామ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల అధ్యక్షులు నాగ సుధాకర్ రెడ్డి, పూర్రం శెట్టి రవి, చంద్రబాబు నాయుడు, చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అంబరీష్, జిల్లా కార్యదర్శి కోన చంద్ర శేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, మరియు కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com