న్యూస్ ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో అజ్మాన్ మైత్రి ఫామ్ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగాయి. గల్ఫ్ సేన జనసేన పార్టీ జాతీయ ఇంచార్జి కేసరి త్రిమూర్తులు, జాతీయ కన్వినర్లు M చంద్రశేఖర్, Ch రాందాస్ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సభ్యుల పర్యవేక్షణలో వైభవంగా జరిగినది. మొదటగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన ఆటపాటలతో కార్యక్రమం ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిలుగా ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి), బొమ్మిడి నాయకర్ (నర్సాపురం), రాయపాటి అరుణ (జనసేన పార్టీ అధికార ప్రతినిధి), కోన తాతారావు (గాజువాక ఇంచార్జ్), రాయపురెడ్డి కృష్ణ (మాడుగుల ఇంచార్జ్) విచ్చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా గల్ఫ్ జనసేన యూఏఈ జనసేన పార్టీ బలోపేతానికి మరియు విజయానికి కీలక పాత్ర పోషించిందని, గల్ఫ్ సేన జనసేన ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే నా సేనకు – నావంతు భాగంలో కోటి రూపాయలు విరాళంతో పాటు ఆరు దేశాలను ఒక తాటిపై తీసుకొచ్చి పార్టీ విజయనికి ఎంతో శ్రమించారని అతిథులు కొనియాడారు. వారి చేతుల మీదుగా కమిటీ సభ్యులకు చిరు సత్కార సన్మానంతో అభినందినిచారు. ఇందులో భాగంగా దేశంలోనే కని విని ఎరుగని రీతిలో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించటానికి ఎన్నో అటుపోటులను తట్టుకుని గెలుపొంది ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన నాయకులకు జాతీయ మరియు ప్రాంతీయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు మరియు జనసేన వీరమహిళలు వారికి చిరు సన్మాన సత్కారలతో అభినంద కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాకు ముందు దుబాయ్ నుండి విశాఖపట్నంకు ఫ్లైట్ ఉండేది. తొలగించిన కారణంగా తిరిగి ఈ సౌకర్యాన్ని కల్పించాలని దుబాయ్/sharjah ట్రావెల్స్ ఫోర్మ్ చైర్మన్ శరత్ యలమర్తి వినతి పత్రంను అందజేశారు. పెద్ద ఎత్తున వైసిపీ నుండి కార్యకర్తలు జనసేన పార్టీలో వారి సమక్షంలో చేరడం జరిగింది. యూఏఈ ప్రబుత్వం వీసా లేకుండ అక్రమంగా ఉంటున్న వారికోసం యూఏఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ( ఆమ్న్‌స్టీ ) కార్యక్రమం కోసం NDA ప్రభుత్వం &భారత కాన్సులేట్ జనరల్ వారి సహకారంతో టిక్కెట్టు కూడా కొనుకోలేని స్థితిలో ఉన్న ప్రవాస భారతీయులను తిరిగి స్వదేశానికి పంపించడానికి సహాయ సహకారాలు అందించాలని గల్ఫ్ జనసేన ఇంచార్జీ త్రిమూర్తులు కోరడం జరిగింది. ఈ సభలో అనేక మంది వక్తలు ప్రసంగించడం జరిగింది. అనంతరం గౌరవ అతిథులు మాట్లాడుతూ తుగ్లక్ పాలను పారద్రోలి , రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటులో NRI ల పాత్ర కీలకం అని కొనియాడారు. ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రతి NRI కి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జన సైనికులు వీర మహిళలు, అతిథుల సమక్షముoలో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేసి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకలు కార్యక్రమంనకు జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు అలాగే కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.