కాకినాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత జనసేనాని పుట్టినరోజు సందర్భంగా కరప గ్రామంలో జనసేన జనసేవాదళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనకి ముఖ్య అతిథిగా హాజరైన PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ గారిని జన సేవాదళ్ గ్రూప్ సభ్యులు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ఈ జనసేవాదళ్ గ్రూప్ వారు కరప మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంతం నానాజీ జనసేవాదళ్ గ్రూపు చేస్తున్న కార్యక్రమాల గూర్చి తెలుసుకొని అభినందించారు. 102 మందికి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జనసేవాదళ్ సభ్యులు మాట్లాడుతూ రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. చాలా మంది స్వతహాగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమం తదనంతరం జనస్వరం న్యూస్ వారు ప్రచురించిన మ్యాగజైన్ " ప్రజల పక్షాన జనసేన " ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే న్యూస్ ను బాహ్య ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తున్న జనస్వరం టీం వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేవాదళ్ అధ్యక్షులు శేఖర్, ఉపాధ్యక్షులు నక్కా అంజిబాబు, సెక్రటరీ శంకర్, జనసేవాదళ్ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు , తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com