Logo
Date of Publish : 05 September 2022, 7:06 am
Editor : Sake Naresh

పెడబల్లిలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

       పుట్టపర్తి ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గం కేంద్రంలోని పెడబల్లి మేజర్ పంచాయితీలో జనసేనపార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శిలు  పత్తి చంద్రశేఖర్, బొబ్బరం శ్రీనివాస్, అబ్దుల్ జనసేన జెండా ఆవిష్కరణ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పలువురు యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటేష్ నాయక్, శ్యాంసుందర్, పుట్టపర్తి మండల కన్వీనర్ పెద్దన్న, కొత్తచెరువు మండల కన్వీనర్ పూల శివప్రసాద్, గిరి, నందీస్, కృష్ణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, సురేష్, అనంతపురం నగర కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, ఒడిసి మండల కన్వీనర్  మేకల ఈశ్వర్, అనంతపురం రూరల్ కన్వీన గంటా రామాంజనేయులు, వీర మహిళలు జనసేన నాయకులు జన సైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com