విజయనగరం ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో నూతనంగా నిర్మించిన జన సేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం గుప్పించారు. పేదలకు ఇల్లు పేరు చెప్పి కోట్లు దోచేశారు అని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పుకోసం, ప్రజల జీవితాల్లో మార్పుకోసం కృషి చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవి మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తానని, జన సేన టిడిపి ప్రభుత్వానికి అధికారం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధికారం లోకి రాగానే నెల్లిమర్ల నియోజక వర్గంలో ఉపాధి కల్పనకు కృషి చేస్తానని, స్థానిక ఎమ్మెల్యే మైనింగ్ డాన్ కి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యాలయం ప్రారంభం కార్యక్రమం పూర్తి పండగ వాతావరణంలో విజయవంతంగా జరగడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com