Logo
Date of Publish : 24 March 2026, 9:23 pm
Editor : Sake Naresh

ఏమినేని రవిచంద్రకు ఘన సత్కారం

- అనంత ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సభ

- ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ప్రశంసలు

అనంతపురము, మార్చి 24 : రాష్ట్ర ప్రభుత్వ ఉగాది అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రంగస్థల నటుడు ఏమినేని రవిచంద్రకు అభినందనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం అనంతపురం ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా సభ నిర్వహించి పలువురు అభినందించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, పౌరాణిక నటుడిగా, జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రవిచంద్రకు ఉగాది అవార్డు దక్కడం అభినందనీయమన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుగా రెండుసార్లు అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్, సీనియర్ జర్నలిస్టులు కె. మార్కండేయులు, ప్రజాశక్తి రవిచంద్ర, డి. కుళ్లాయప్ప, కవులు డాక్టర్ ఏ ఏ నాగేంద్ర, పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com