కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

  • ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం 
  • లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ
  • పండుగ వాతావరణం లో పెన్షన్ల పంపిణీ
  • పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు 

           అనంతపురం రూరల్ (జనస్వరం) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారి ప్రతిష్టాత్మకంగా జూలై 1న చేపడుతున్న ఎన్టీఆర్ భరో సా పెన్షన్ల పంపిణీ కార్యక్రమా న్నిఅనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సీనియర్ ఎన్‌టి‌ఆర్, పరిటాల రవి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ నాయకులు నాగలింగమయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో ఒక సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల చెంతకు వెళ్లి, పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దానిలో భాగంగానే ముఖ్యమంత్రే స్వయంగా పెన్షన్ల పంపిణీకి, లబ్ధిదారుల చెంతకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఒకేసారి రూ.1000 లు పెంచడం అదనంగా మరో రూ.3వేలను అందిస్తామని, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, మొత్తం రూ.7వేలను అవ్వా, తాతలు, ఇతర లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లి విరుస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసాతో వేలాదిమంది పేద కుటుంబాలకు, ఆసరా లభిస్తుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై, అనేక దుష్ప్రచారాలు చేసి, పెన్షన్ దారులను మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. ప్రజలందరూ మోసకారి వైసిపి పాలనకు చరమగీతం పాడి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అనంతరం సచివాలయ అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ సజావుగా సాగేలా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, లబ్దిదారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way