పాయకరావుపేట (జనస్వరం): మండలంలోని గుంటపల్లి లో శుక్రవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు విచ్చేసి అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గెడ్డం కన్నబాబు, యువ నాయుకులు గెడ్డం చైతన్య, మండల విద్యాశాఖ అధికారి కాకాడ నాగేంద్ర గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com