Logo
Date of Publish : 31 March 2026, 8:31 am
Editor : Sake Naresh

విద్యా పాఠశాలలో ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు

శేరిలింగంపల్లి, మార్చ్ 30,(జనస్వరం) : శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ విద్యా గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో సోమవారం 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వాణి త్రిమూర్తులు పొన్నాడ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, చిన్నప్పటి నుంచే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ గోదావరి గైక్వాడ్, ఎస్సై చైతన్య రెడ్డి విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. పిల్లలను ప్రేమతో సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విద్యా స్కూల్ అంకితభావంతో పనిచేస్తోందని వారు కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించగా, కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మావతి, సక్కుబాయి, మధుస్మిత, సుబ్బారావు, కొండల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com