Logo
Date of Publish : 02 August 2022, 6:16 am
Editor : Sake Naresh

G+3 హౌసెస్ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వం : లక్ష్మణ కుటాల

         కదిరి ( జనస్వరం ) : పేద, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన మంత్రి ఆశాస్ యోజన కింద నిర్మించిన G+3 హౌసెస్ అసంపూర్ణ నిర్మాణం కారణంగా ప్రజాధనాన్ని వృదా చేసి కాలయాపన చేస్తున్నారని జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన TIDCO ఇళ్ళ నిర్మాణం పనులు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు మోక్షం ఎప్పుడు కలిగిస్తారని లబ్ది దారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల నిర్లక్ష్యమా..?? లేక అధికారుల నిర్లక్ష్యమా..?? పేద ప్రజల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గతంలో లబ్ది దారుల దగ్గర ఇళ్ళ కేటాయింపు కోసం (లాటరీ పద్దతిలో ) డబ్బులు కూడా వసూలు చేశారు. మునిసిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి దారులు మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఇళ్లను కేటాయిస్తామని చెప్తున్నారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజలు దగ్గర వసూలు చేసిన డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చి, G+3 ఇళ్ళ నిర్మాణం తొందరగా పూర్తి చేసి పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కళను తొందరగా తీర్చాలని కదిరి జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాము అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com