Logo
Date of Publish : 12 December 2022, 4:16 pm
Editor : Sake Naresh

ప్రభుత్వం తుఫాను బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి : నలిశెట్టి శ్రీధర్

              ఆత్మకూరు ( జనస్వరం ) : మాండస్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆత్మకూరు నియోజకవర్గంలో రైతాంగం తీవ్ర నష్టానికి గురైంది. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో పత్తి, మిరప, వేరుశనగ, పొగాకు, మినుము తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ అన్నారు. ఒకవైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న రైతాంగానికి మాండస్ తుఫాన్ మరొకసారి దెబ్బతీసింది. ఆత్మకూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు పర్యటించి రైతులకు ధైర్యం చెప్పరు. ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో స్క్రిప్ట్ పంపే తాడేపల్లి పెద్దలు, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు చెప్పరు? గత వ్యవసాయ సీజన్ కు సంబంధించి ధాన్యం బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 320 కోట్లకు పైగా ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. ఈ సీజన్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులు పాల్చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com