Logo
Date of Publish : 12 October 2022, 3:27 pm
Editor : Sake Naresh

వరద ముంపు బాధితులకు ప్రభుత్వము తక్షణమే 10 వేల రూపాయలు సాయం అందించాలి : రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్

     రాప్తాడు, (జనస్వరం) : రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలంలోని హమాలిని కాలనీ, ఆదర్శనగర్, జాకీర్ కొటాల్, దండోరా కాలనీలో ఈరోజు సాయంత్రం ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షం పడుతున్న లెక్కచేయకుండా రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించడం జరిగింది. గత మూడు రోజుల నుంచి ఎడతెరపని వర్షాలతో అక్కడి ప్రజలు, ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ బయటకు రాలేని పరిస్థితిలతో ఉన్నారు. వారికోసం తన వంతు సాయంగా అక్కడ ప్రజలకు, చిన్నపిల్లలకు బ్రెడ్ ప్యాకెట్లను అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వెంటనే ఇక్కడ ముంపుకు గురైన ప్రజలకు తక్షణ సాయంగా కుటుంబానికి 5000 వేల రూపాయలు నుండి 10000 వేల రూపాయలు సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలా ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలందరు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాయల్ నరేష్, నాగార్జున, సూరి, వీరేష్ కాలనీ వాసులు నవీన్ రమేష్, బాబు, అంజి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com