Logo
Date of Publish : 15 December 2023, 11:33 pm
Editor : Sake Naresh

ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా బాధను మాత్రం ఎవరూ తీర్చడం లేదు

    ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 62వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా బాధలు మాత్రం తీరటం లేదని ఇప్పటివరకు అనేకమందికి అవకాశం ఇచ్చామని అన్నారు. దోమల మందు కూడా కొట్టేవారు లేరని అలాంటివి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అనీ అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు మన ప్రాంతంలో అనేక సమస్యలను గుర్తించామని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, ఉంగరాల వాసు, యాదల సుధీర్, సాయి, రవీంద్ర, భరత్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com