తూర్పుగోదావరి ( జనస్వరం ) : కపీలేశ్వరపురం మండలంలోని వల్లూరులో పింఛన్లు పంపిణీ సమయంలో సర్పంచ్ దాసి మీనా కుమారి గారిని దళిత మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరియు వారి అనుచరులు దుర్భాషలాడి, దాడికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు అందచేసిన జిల్లా ఇంచార్జిలు. తక్షణమే సర్పంచ్ ఫిర్యాదుపై స్పందించి ఎమ్మెల్సీ తోటతో పాటు రుద్రయ్య చౌదరి, సతీష్ ఇతరులపై SC,ST కేసు నమోదు చేయాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com