అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గములో హుకుంపేట మండలం బూర్జ పంచాయితీ మజ్జివలస గ్రామంలో శుక్రవారం ఉదయం జనసేనపార్టీ నాయకులు సాయిబాబా, దూరియా, పరశురామ్, సింబోయ్, ఎం పీ టి సి అభ్యర్థి, రాప, బుద్దు ఆధ్వర్యంలో ఆయా గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. అనంతరం ఈ సందర్బంగా సాయిబాబా, పరశురామ్, బుద్దు మాట్లాతుడుతూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలోనే చూస్తున్నామని ప్రజలకు సూచించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పట్టా పేరుతో పదివేలు రూపాయలు వసూలు చేసే విధానాలు తీసుకు వచ్చిందని, దీనిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి, జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ ప్రభుత్వంపై ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కీరంగి, రాంప్రసాద్, రాప, మహేష్, ఉప సర్పంచ్, సింబోయ్, లక్ష్మి, కేరంగి, అప్పలస్వామి, పెట్టిలి, మదన్ తదితరులు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com