అరకు, (జనస్వరం) : అరకులోయ గిరిజన ప్రాంతంలో గిరిజన మ్యూజియంలో మయూరి, ధీంసా కళాకారులతో జనసేన పార్టీ అరకు పార్ల మెంట్ అధికార ప్రతినిధి మాదాలా శ్రీరాములు, అరకు వేలి మండల నాయకులు అల్లంగి రామకృష్ణ సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ గిరిజనులు అనేక రకాల వృత్తులు చేసి జీవిస్తుంటారు. గిరిజనులు ధీంసా కళనే నమ్ముకుని బ్రతకుతున్నారు. మరి కొంత మంది మయూరి నాట్య కళను నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. కొండల్లో వుండి, పస్థులుండైన సరే ఎక్కడ నుండో వచ్చే పర్యాటకులకు వారి నృత్యాలతో పర్యాటకులను మైమరిపించే ధీంసా, మయూరి నాట్యలతో అలరిస్తుంటారు. వారి కష్టాలకు ప్రతి ఫలం అందటం లేదు. కరోనా కష్ట కాలములో కుడా పర్యాటకులను ధీంసా, మయూరి నాట్యలతో అలరిస్తున్నారు. గిరిజన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. అందరికి ఆనందాన్ని ఇస్తున్నారు గానీ వారి ఆనందాన్ని కోల్పోతున్నారు అని, వారిని వెంటనే ప్రభుత్వము ఆదుకోవాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com