చర్మకారులను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ
జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ బృందం జగ్గయ్యపేట పట్టణంలోని వృత్తి ని కొనసాగించుకుంటున్న చర్మకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా కారణంగా లాక్ డౌన్ సమయం లో జనసంచారం లేకపోవడంతో ఉపాధి లేక కుటుంబాలు గడవడం చాలా ఇబ్బంది గా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికీ కూడా కొంత ఆర్థిక సహాయం అందించాలని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కొర్రపాటి గోపీచంద్, రామారావు, సాయి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.