పొన్నూరు, (జనస్వరం) : పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలం, పొన్నూరు మండలంలో వరదల వలన నష్టపోయిన వరి రైతులను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు గారు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే అధికారులను నియమించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి కనీసం నలభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ వరదలు వలన పంటపొలాలు తీవ్రంగా నష్టపోయి రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారు అయ్యింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత సంవత్సరం కూడా పాతిక వేల రూపాయలు కౌలు రైతులు నష్టపోయారు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడి అధికంగా ఉంటుంది కాబట్టి వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అలాంటి కౌలు రైతులను ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, కొప్పుల కిరణ్, మేకల రామయ్య, తాళ్ళూరిఅప్పారావు, చేబ్రోలు మండల నాయకులు చందు శ్రీరాములు, నారిశెట్టి కృష్ణయ్య,పెదకాకాని మండలం అధ్యక్షులు వీరెళ్ళవెంకటేశ్వరరావు, నాగబాబు, శేఖర్, జనసేన నాయకులు కొండూరి కిషోర్ కుమార్, శిఖాబాలు, చింతారేణుకారాజు, యడ్ల నాగమల్లేశ్వరరావు, మాదాసు శేఖర్, దళవాయి భార్గవ్ రామ్, నాగిశెట్టి సుబ్బారావు, చేబ్రోలు, పొన్నూరు, జనసేన సైనికులు, మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com