అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : రాహుల్ సాగర్
అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నాయకుడు రాహుల్ సాగర్ కోరారు. ఈ సందర్భంగా కర్నూలు జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ టి వి పి కాలనీ లో నివాస౦గా ఉంటున్న నాగరాజ్ గోబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి అధికారుల నిర్లక్ష్యానికి బలి కావడం ఎంతో బాధాకరం. రోడ్ల మరమ్మతులు పనుల్లో భాగంగా ఈ సంఘటన జరగడం, అందులో ఒక నిండు ప్రాణం కోల్పోవడం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డ అధికారులు ప్రభుత్వం నాగరాజ్ కుటుంబానికి అండగా ఉండాలని నాగరాజ్ కుటుంబంలో ఒక్కరికి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు తరఫున రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు.