చిత్తూరు, (జనస్వరం) : ఐరాల వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన జవాద్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పల్లెలు, గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 ,000/-రూపాయలు చొప్పున పూరిళ్ళు కోల్పోయిన పేద ప్రజలకు 1,00,000 -/-రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఆర్థిక సాయంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com