
● అగ్నిప్రమాద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
● తక్షణ సహాయం అందజేయాలి.
●షేక్ అహ్మద్ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయాలి.
అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన షేక్ అహ్మద్ కుటుంబాన్ని కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరామర్శించి ఓదార్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి కోడూరు మండల జనసేన పార్టీ తరుపున 11,500 రూపాయలు నగదు, రెండు వేలు విలువ చేసే నిత్యవసర వస్తువులు, బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మర్రే గంగయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే తక్షణ సహాయాన్ని వెంటనే ఇవ్వాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మత్యకార వికాస్ విభాగ రాష్ట్ర కార్యదర్శి లంకే యుగంధర్ రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా కోడూరు మండలంలో పదుల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు కోడూరు మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తీరప్రాంత గ్రామలు కోడూరు మండల పరిధిలో చాలా ఉన్నాయని, కాబట్టి తక్షణమే అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. షేక్ అహ్మద్ కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున ఆదుకోవడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత మాట్లాడుతూ ప్రభుత్వం కూడా స్పందించి షేక్ అహ్మద్ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు అని తెలిసిందని, కాబట్టి అతనికి ఇంటి స్థలం మంజూరు చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పిట్టలంక సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నేతలు ఉల్లి శేషగిరి రావు, యర్రంశెట్టి దామోదరరావు, బడే వెంకటేశ్వరరావు, చిట్టిఫ్రోలు మనేష్, బడే రాజశేఖర్, సిద్దినేని అశోక్ నాయుడు, దాసరి వెంకట కృష్ణారావు, పూషడపు భాను, మేడా పిచ్చయ్య, కోడూరు మాజీ ఉప సర్పంచ్ బడే వెంకటస్వామి, పెద్ది వెంకట్, నారేపాలెం నరేంద్ర, పృథ్వి, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, పరిశె సుబ్రమణ్యం, బడే కృష్ణా, ఎస్కే అల్లాబక్షు, జరుగు వెంకటేశ్వరరావు, అబ్దుల్ లతీఫ్, బడే వేణు గోపాల్, తోట సోమశేఖర్ రావు,పైడిపాటి నాగ బసవయ్య, మర్రే గోవర్ధన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.