Logo
Date of Publish : 30 September 2020, 12:43 pm
Editor : Sake Naresh

పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు ఈమని కిషోర్

పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు ఈమని కిషోర్

                    కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం, రావిరాల గ్రామం రాష్ట్రంలో అదే విధంగా నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి మరియు గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వలన కృష్ణా నది ఉప్పొంగడంతో వరద ప్రభావిత ప్రాంతం అయిన రావిరాల గ్రామంలో వరదల వలన పంట పొలాల్లోకి నీరు చేరడంతో నష్టపోయిన పంటలని ఈరోజు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా పంట పొలాలని సందర్శించి, సంబంధిత రైతులతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ వరదల వలన సుమారుగా రావిరాల గ్రామంలో రైతులు పండించుకునే 150 ఎకరాలకు గాను 20 ఎకరాలు మినహాయించి సుమారుగా 130 ఎకరాలకు పైగానే పంట పొలాలు దెబ్బ తిని రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. రైతు పడ్డ కృషి వారి పెట్టుబడి వృధా అయిపోయిందని, ముఖ్యంగా పత్తి రైతులు ఈ వరదల వలన అతలాకుతలం అయిపోయారని, రావిరాల వాగు వలన వరదల సమయంలో ఉదృతంగా వరద నీరు పంట పొలాలలోకి వెళ్లటంతో రైతులు పంటలు పండించుకోలేక ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, త్వరితగతిన వాగుకి కట్టలు ఏర్పాటు చేయాలని రైతుల తరపున ఆయన కోరారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరియు సంబంధిత అధికారులు నష్టపోయిన పంట పొలాలని గుర్తించి రైతులకు సరిపడా న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, చైతు, గోపి, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com