చంద్రగిరి, (జనస్వరం) : ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ముంపునకు గురైన ప్రాంతాలను, నష్టపోయిన పంటపొలాలను జనసేనపార్టీ చిత్తూర్ జిల్లా కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ దేవర మనోహర పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ కు చెందిన పాతకాల్వ, గొల్లపల్లి, చిగురువాడ, రామనుజపల్లి ప్రజలకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వారి సొంత భూములను కాపాడుకునే క్రమంలో పేద ప్రజల భూముల వైపు వరద నీటిని దారి మళ్లించడంతో ప్రజలు వారి ఇళ్లను మరియు పంటలను నష్టపోయారని తెలిపారు. ఈ క్రమంలో పంట నష్టపరిహారంలో భాగంగా ప్రభుత్వం ఒక ఏకరాకు కంది 20000, జొన్నకు 25000, వరికి 30000, వేరుశనగ 35000,
అరటికి 45000, జామకు 60000, చొప్పున మొత్తం నష్టం విలువ 150 ఎకరాలకు కాను సుమారు 40 లక్షలు రూపాయలు వుండవచ్చని క్షేత్రస్థాయి పర్యటనలో తేలిందని అది ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించని యెడల ప్రజలపక్షాన జనసేన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.