డోన్, (జనస్వరం) : డోన్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సంబంధిత ఇంజనీర్ గారిని కలిసి నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకుని, పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన జనసేన నాయకులు బాలు యాదవ్. ఈ సందర్భంగా బాలు యాదవ్ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గ మారుమూల గ్రామ ప్రజలు అత్యవసర వైద్య సేవల కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని నిర్మాణ పనులను వేగవంతం చేసి నియోజకవర్గ ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com