అరకు ( జనస్వరం ) : పెంచిన ఆర్టీసీ , విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని జనసేన పార్టీ జనసేన నాయకులు సాయిబాబా దురియ ఆధ్వర్యంలో అనంతగిరి మండలం బొర్రా జంక్షన్ వద్ద ప్ల కార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయి బాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవులో కూర్చొనే పవర్ కల్పించండి అంటూ ప్రజలను వేడుకొన్న నేపథ్యంలో జగన్ రెడ్డిని పవర్ ఇచ్చి ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్న అనంతరం మనకున్న విద్యుత్ పవర్ ని తీస్తూ ఫ్యాన్ తిరక్కుండా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ద్వారా చూస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పేదోళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తానని చెప్పిన మాటలను నాని ముఖ్యమంత్రి గారు మర్చిపోయారేమో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీటన్నిటిని పరిశీలిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇంతే కాకుండా రాష్ట్రంలో నిన్నటి వరకు ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై మరింత భారం మోపేందుకు ప్రభుత్వం కుట్ర గాని భావిస్తున్నామని, ఇవే కాకుండా నిత్యావసర సరుకులు నేల నుండి ఆకాశం అందినంత వరకు అధిక రేట్లు పెంచారు, వీటన్నింటిపై నిత్యం ప్రజలు దృష్టి సారిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు వైయస్సార్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. ఏదేమైనా రాష్ట్రంలోని ప్రజల సమస్యల పట్ల జనసేన పార్టీ ఇప్పుడు ఎల్లప్పుడు అండదండగా వారికోసం నిలబడుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు మరియు నిత్యవసర సరుకులను రేట్లు తగ్గించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సన్యాసిరావు. రాజు. తదితరులు పాల్గొన్నారు.