జన పీడిత బడ్జెట్ అని సీయం గారు భవన నిర్మాణ కార్మికులకు, రోజూవారి కూలీలకు, పేదవాడికి 10 రూపాయిలు ఆశ చూపించి 90 రూపాయిలు పన్నుల రూపంలో లాక్కొంటున్నట్టు ఉందని మైలవరం జనసేన నాయకులు అక్కల గాంధీ మోహనరావు గారు అన్నారు. SC, ST, BC, మైనార్టీ, కాపు, ఇతర అనేక కార్పొరేషన్ లకు వేల కోట్లు డబ్బులు కేటాయించి ఆ నిధులను పక్కదోవ పట్టిస్తున్నారు. కార్పొరేషన్ లో నిధులు లేక ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, బడుగు బలహీన వర్గాల చదువు కున్న నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం లోన్లు పెటుకోని ఎదురు చుస్తునారు. రైతులు పండించిన పంట పొలాలలో మార్కెట్ యార్డులో ధాన్యం వర్షాలకు తడిసి మొక్క వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయక ఆశతో ఎదురు చూసి ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులలో రైతులు ఉన్నారు. వారికి భరోసా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి సంబంధించి కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న మూడవ దశ ప్రారంభం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు చేస్తున్న దానికి సంబంధించి ఎటువంటి కేటాయంపులు ఏర్పాటు చేయక పోవటం దారుణం అన్నారు. అభివృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, నిర్మాణం, గ్రామలలో మౌలిక సదుపాయలు, రవాణా రంగానికి ఎటువంటి కేటాయంపులు చేయలేదు. బడ్జెట్ సీయం జగన్ మోహన్ రెడ్డి అంకెల గారడీ గాను పేదవాడి నడ్డి విరిగినట్లు ఉంది. రోజువారీ కూలీలు గత నుండి ఇసుక లేక పనులు లేక ఆర్ధిక ఇబందులు పడుతున్నారు. వారికి భరోసా కల్పించలేదు. పూర్తిగా జన పీడిత బడ్జెట్ గా జనసేన పార్టి అభివర్ణిస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి :
ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల రద్దు హర్షణీయం : రేఖగౌడ్
అన్నదాత రోడ్డు పాలు… ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి : మైలవరం జనసేన ఇంచార్జ్ అక్కల రామ మోహన రావు
జనసేన కార్యకర్త ఉపేంద్ర మృతి పార్టీకి తీరని లోటు : రాహుల్ సాగర్
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here