Logo
Date of Publish : 28 November 2020, 9:29 am
Editor : Sake Naresh

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్ధికపరమైన అండనివ్వాలి : ఈమని కిషోర్

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్ధికపరమైన అండనివ్వాలి : ఈమని కిషోర్

             నివర్ తుఫాన్ మూలంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం అదే విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పలు మండల్లాల్లో గల గ్రామాల్లో కూడా పంటలు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరం అని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ తెలిపారు. జగ్గయ్యపేట మండలంలో పలు గ్రామాల్లో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా ఆయన శనివారం తన బృందంతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఆయన సందర్శించిన పలు గ్రామాల్లో సుమారుగా 300 ఎకరాలకు గాను 70 నుంచి 80 లక్షల కు పైగానే ఆర్ధిక నష్టం జరిగిందని ఆయన తెలిపారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తులో రైతాంగం దెబ్బతిని ఈ పంట నష్టం జరిగిందని, ఈ పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అప్పుల పాలవుతున్న రైతులకు ఈ నష్టం మరింత కుంగదీసే విధంగా ఉంది కాబట్టి పెట్టుబడి రాయితితో పాటుగా పంటల బీమాను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని, రైతులని అన్ని విధాలా ఆదుకోవాలని మా అధ్యక్షుల వారి తరుపున జగ్గయ్యపేట జనసేన పార్టీ తరుపున ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాది ఖరీఫ్, రబి పంటల నష్టానికి సంబంధించి బీమా మొత్తాలు ఇప్పటికి దెబ్బతిన్న రైతులకు అందలేదు అని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ తగిన విధంగా స్పందించాలని ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తుల వలన ఈ ఏడాది పంటలు కోల్పోయిన రైతులకు అన్ని అన్ని పంటలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, గోపి, రాం, నరసింహ, శ్రీకాంత్, చారి, నాగ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com