Logo
Date of Publish : 10 August 2022, 1:55 pm
Editor : Sake Naresh

టమోటా రైతులను ప్రభుత్వము తక్షణమే ఆదుకోవాలి : అనంతపురం జనసేన నాయకులు

     అనంతపురం, (జనస్వరం) : టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకుండా రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అందులో ప్రధానంగా అనంతపురం టమోటా మార్కెట్ మండి వద్ద లక్షల టన్నుల టమోటా వృధాగా ఉన్న పరిస్థితి మీడియా ద్వారా వివిధ రైతులు రైతు సంఘాల ద్వారా ఇప్పటికే మనందరికీ తెలుసు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది కలెక్టర్లు మారిన అనంతపురం జిల్లా మార్కెట్ యార్డ్ మండి టమోటా పంటను గుట్టలు గుట్టలుగా పడివేయడం పరిపాటిగా మారిందని తెలిపారు. అనంతపురం టమోటా మండి నుండి దేశ నలమూలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. గుట్టలు గుట్టలుగా పారవేసిన టమోటాలను చూసి అక్కడున్న రైతులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేశారు. అలా చేయని పక్షాన జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జాము, ఊరగాయ, టమోటా జాము, టమోటా ఊరగాయ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వడ్డే వెంకటేశు, మహేష్, పవన్, రైతులు రామాంజనేయులు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com