ఆలూరు, (జనస్వరం) : జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జి తెర్నేకల్లు వెంకప్ప మాట్లాడుతూ హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఈ నెల 21 వ తేదీన గ్రామానికి చెందిన చంద్ర(30), తాయన్న (20) పిడుగుపాటుకు గురై మరణించడం చాల బాధాకరం. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం క్రింద 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. మరణించిన కుటుంబాలకు బీమా లేనిచో APSDMA (ANDHRA PRADESH STATE DISASTER MANAGEMENT AUTHORITY) ద్వారా తక్షణమే చొరవ తీసుకొని కుటుంబాలకు అండగా నిలబడాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేశారు. అలాగే పిడుగుపాటుకు గురికాకుండా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపారు. పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలను త్వరలోనే జనసేన పార్టీ తరుపున పరామర్శిస్తామని తెలిపారు.