గాయపడిన బాధితులను ప్రభుత్వమే వెంటనే ఆదుకోవాలి : జనసేన నాయకులు పీలా రామకృష్ణ
విశాఖలోని మల్కాపురం హెచ్ పి సి ఎల్ లో గోడకూలి ఒకరు దుర్మరణం చెందారు. ముగ్గురకి స్వల్ప గాయాలు అవడం వలన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఘటన జరిగింది. ఈ గోడ నాలుగు నెలలు క్రితం నిర్మించింది. ఒక్కసారిగా పడిపోవడంతో రమేష్ కుమా బిహార్ కు చెందినవారు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం గానీ, కంపెనీ యాజమాన్యాలు సరిఅయిన భద్రతా ప్రమాణాలు పాటించక పోతే ఇలాంటివి పునరావృతం అవుతూనే వుంటాయి అని అక్కడ వచ్చిన జనసేన పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు మాట్లాడారు. అదే విధముగా 40వ వార్డ్ జనసేన అభ్యర్థి శ్రీ కంటంరెడ్డీ శివ శంకర్ గారు, 62 వార్డ్ BJP అభ్యర్థి ప్రకాష్ ములకలపల్లి కూడా మాట్లాడుతూ HPCL భద్రతా లోపాలు వల్లే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నారు. ఇక్కడ HPCL గేట్ ముందు బాధితులకు అండగా నాయకులు మరియు జన సైనికులు శ్రీకాంత్, వెంకటేష్, కిశోర్ తదితరులు ఈ ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు.