Logo
Date of Publish : 28 November 2020, 12:23 pm
Editor : Sake Naresh

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : జససేన నాయకులు మైలేరీ మల్లయ్య

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : జససేన నాయకులు మైలేరీ మల్లయ్య

             ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో గత మూడు రోజులుగ నివర్ తుఫాన్ వల్ల చేతికి వచ్చిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న పంటలు నీటి పాలు కావటం జరిగింది. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు 20,000/ చెల్లించాలని ఆళ్ళగడ్డ జనసేన పార్టీ నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వరి పంట దిగుబడి తగ్గిందని దానికి తోడు బస్తా వడ్లు 1,000/ రేటుతో వ్యాపారస్తులు కమిషన్ దారులు సిండికేట్గ ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల్లో ముంచేస్తున్నారని రైతు ఎకరం వరి పండించడానికి 25,000/ పెట్టుబడి అవుతుందని అన్నారు. రైతు చేతికి 30,000/ వస్తుంది అంటే రైతు ఐదు నెలలు కష్టపడితే ఒక ఎకరాకు 5,000/ వస్తుంది. నివర్ తుఫాన్ వల్ల రైతుకు ఆ డబ్బులు కుడా రాక నష్టాలే మిగిల్చాయి. స్థానిక ఎమ్మెల్యే గారు వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతుల పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్ట పరిహారాన్ని వెంటనే అందజేయాలని అలాగే కల్లాలలో తడిచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ ఆళ్లగడ్డ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జససేన నాయకులు రాజారామ్, మహబూబ్ బాషా మద్దిలేటి, పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com