కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలంలోని గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో గత కోన్ని రోజులు క్రితం కరోనా బాధితులు కోసం క్వారంటైన్ సెంటర్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సెంటర్ నందు కొంతమంది బాధితులు కూడ అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఈ సెంటర్ నందు కరోనా పాజిటివ్ కేసులు, ఆక్సిజన్ శాతం 90 నుండి 93% ఉన్నవారిని అడ్మిట్ చేసుకోని వైద్యం చేస్తున్నారు. కొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆక్సిజన్ మిస్సన్స్ కూడా ఇచ్చివున్నారు. నియోజకవర్గంలో ఈ సెంటర్ ఓపెన్ చేసిన తరువాత కరోనా బాధితులు చాలా సంతోషం పడినారు. ఇక్కడ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేసినారు గానీ ఇప్పటి వరకు ఈ సెంటరకు ప్రభుత్వం వారు మందులు పంపకపోవటం చాలా బాధాకరంగా ఉంది. కరోనా బాధితులను అడ్మిట్ చేసుకుంటున్నారు మందులు మాత్రం బయట తెచ్చుకోండి అనీ చీటి వ్రాచి ఇస్తున్నారు. బాధితుల బంధువులు ఆ చీటి తీసుకోని, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మెడికల్ షాపులు చుట్టూ తిరుగుచున్నారు. డాక్టర్ గారు వ్రాచీన మందులు అన్నీ ఒకే షాపులో దొరకక చాలా ఇబ్బంది పడుచున్నారు. బయట మెడికల్ షాపులలో మందులు రేట్లు వేలుకు వేలు తీసుకుంటున్నారు. అసలే నీరుపేద కుటుంబాలు వారు. కరోనా జబ్బుతో బాధపడుచు వైద్యం కోసం వస్తే క్వారంటైన్ సెంటర్లో మందులు లేవు. ప్రభుత్వం మందులు ఇవ్వనప్పుడు ఈ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ వలన ఉపయోగం ఏమిటి? అని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు ధ్వజమెత్తారు. అవనిగడ్డ 2 వ వార్డుకు చెందిన M. సాలి అనే ఒక 55 ఏళ్ళ మహిళాకు ఆక్సిజన్ శాతం 92 % ఉంది అడ్మిట్ అయ్యింది. ఇప్పటివరకు ఆమె బంధువులు మెడికల్ షాపులు చుట్టూ తిరుగుచున్నారు, డాక్టర్ గారు వ్రాచీన అన్నీ మందులు దొరకలేదు కోన్ని దొరికినాయి మందులు బిల్లు 4000 అయ్యింది. ప్రభుత్వం ఇవ్వవాల్చిన మందులు బయట తెచ్చుకొనే పరిస్థితి చాలా బాధాకరం. నిరుపేదలు ఎలా బ్రతుకుతారు? నియోజకవర్గం ఎంఎల్‌ఏ గారు, వైద్య అధికారులు వెంటనే స్పందించి కరోనా క్వారంటైన్ సెంటర్కు కావలిచిన మందులు తెప్పించి బాధితులకు మంచి వైద్యం అందించవలచినదిగా జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము అని అన్నారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com