Search
Close this search box.
Search
Close this search box.

అనంతపుర౦ జిల్లాలో రైతులకు ప్రభుత్వము తక్షణమే ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి

అనంతపుర౦

       శింగనమల ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దాదాపుగా 3.86లక్షలహెక్టార్లలో 2023 ఖరీఫ్ లో వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, జొన్న, సద్ద, కొర్ర అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరు నుండి సాగు చేయడం జరిగినది. కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఎండిపోవడం జరిగినది. అప్పటినుండి ఇప్పటివరకు వర్షాలు రాక రైతులు పెట్టిన పంటలన్నీ నష్టపోవడం జరిగినది. ఇప్పటికే పంటలవారిగా ఎకరాకి 30 వేల రూపాయల వరకు పంటలు పెట్టి నష్టపోవడం జరిగినదని అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. ఈ సంవత్సరం వానలు పడకపోవడం వలన జిల్లావ్యాప్తంగాలక్షల ఎకరాల్లో వేసినఅన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది. జిల్లా వ్వాప్తంగా 63 మండలాలో పూర్తీస్థాయిలో కరువుచాయలు నెలకోన్నాయి, తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపి నష్టపరిరిహరము అందించాలి. లేకుంటే పెద్దఎత్తున జనసేన పార్టీ ఆధ్వర్యంలోఅందోళనచేస్తామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way