నీటమునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలి : శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామంలో అత్యధిక వర్షాలు కారణంగా రైతుల యెుక్క పంట పూర్తిగా మనిషి లోతు వరకు నీటమునిగి పోయింది. నష్టపోయిన తమను ఈ ప్రభుత్వం ఏ రూపంలోనూ సహయం అందటం లేదని కౌలు రైతులు, రైతులు అందరూ కలసి శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు రైతులకు వెంటనే నష్టపరిహార సహయం అందించాలని రైతే మన దేశానికి వెన్నుముక అని రైతులకు న్యాయం చేయాలని రామచంద్రపురం
నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు యాళ్ళ వేణుగోపాలరావు గారు, బుంగారాజుగారు, కోటాశ్రీనివాసరావు గారు, సంపత్, క్రిష్ణ చైతన్య , డేగల సతీష్ , ఆనంద్, మిధిల్, రాంబాబు నాయుడు, మణీంద్ర, నున్న విష్ణు మూర్తి, రత్న కుమార్, యాళ్ళ రవి, పెద్దిరెడ్డి సతీష్, యేరుబండినాని, నామావిష్ణుచక్రం, చోడిశెట్టి శ్రీను, వీరబాబు, బాలరాజు, కాండూరి సూర్యనారాయణమూర్తి, పైడికొండల వీర నాగేశ్వరరావు, పైడికొండల దుర్గారావు, నాగరాజు, మణికంఠ నేతికొండ, వినకోటి నూకారావు, కౌలు రైతులు కమిడి సత్యనారాయణ, జోడా భీమరాజు తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.