Logo
Date of Publish : 12 August 2020, 10:31 am
Editor : Sake Naresh

కరోనా బారిన పడిన పాత్రికేయులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన మురళి

కరోనా బారిన పడిన పాత్రికేయులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన మురళి

      జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్వహించిన సమావేశంలో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా పై జరుగుతున్న పోరాటంలో ముందుండి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పాత్రికేయు మిత్రులు కరోనా బారిన పడి చనిపోవడం చాలా బాధాకరం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అనేక సార్లు జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసాము, అయినా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిన్న చూపు చూస్తుంది. పాత్రికేయులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి. మీడియా సిబ్బందిని వెంటనే కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలి. వారికి కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి. కోవిడ్ ఆస్పత్రులలో వెంటనే సదుపాయాలను మెరుగు పరచాలి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచార శాఖ ద్వారా పిపిఈ కిట్స్ అందజేయ్యాలి. కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు హోమ్ ఐసొలేషన్ కోవిడ్ కిట్ లతోపాటు వైరస్ బారినుండి కోలుకునేదాకా ప్రతిరోజూ 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి అని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com