Logo
Date of Publish : 07 December 2023, 11:15 pm
Editor : Sake Naresh

అర్హత ఉన్నా అందని ప్రభుత్వ పథకాలు – కళ్ళకి కనిపిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

       జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 728వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో లక్కోజు ఆచారి అనే వ్యక్తి గత యెనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నా కానీ ఇప్పటి వరకు ఆయనకు అంగవైకల్యం పింఛను రాకపోవడం దురదృష్టకరం. ఆచారి గారు గత యెనిమిది సంవత్సరాలనుండి కూడా మంచం మీది నుండి లేవలేని పరిస్థితిలో ఉండగా వారి కుమారుడు కార్పెంటర్ పని చేసుకుంటూ కనీసం సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో తన తండ్రి బాగోగులు చూసుకుంటూ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఈయన పరిస్థితిని చూసి కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం. ఈయన పరిస్థితిని నేరుగా చూసి ఒక నెల రోజుల లోగా ఈయనకు పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే నియోజకవర్గవ్యాప్తంగా ఈ విధంగా దయనీయ పరిస్థితిలో ఉండి అర్హులైన వారిని గుర్తించి వారందరికీ తప్పకుండా అండగా నిలబడతామని సూర్యచంద్ర హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com