నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 123వ రోజున 50వ డివిజన్ రంగనాయకులపేట లోని ఉప్పరపాలెంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజాసమస్యల అధ్యయనం చేసి ఆ సమస్యల పట్ల పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 30 కుటుంబాల వరకు మునిసిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు తీసేయడంతో అరకొర జీతాలతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. ఇంజనీరింగ్ చదివే తమ కుమారుని చదువు నిమిత్తం ఏడాదికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతోందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన కారణంగా తన కుమారునికి ఫీజు రీయింబర్స్ మెంట్ రావట్లేదని దీంతో ఏడాది సంపాదన మొత్తం కుమారుని చదువుకే ఖర్చవుతోందని ఓ తండ్రి కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేసుకుని కుటుంబాలను చూసుకునే వారికి వైసీపీ ప్రభుత్వంలో పథకాలు దక్కట్లేదని, అనర్హులకు ఉచితాలు అందుతున్నాయని వాపోయారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని, ప్రభుత్వ పథకాలను ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని అర్హులందరికీ ఇస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com