వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ప్రచారం ఎక్కువ అభివృద్ధి తక్కువ అని జనసేన రాష్ట అధికార ప్రతినిది అక్కల రామమోహన రావు (గాంధి) అన్నారు. ప్రజల పరిస్థితి ముందు నుయీ వెనక గోయి లాగా ఉంది. 2 సంవత్సరాల నుండి ప్రజలకు ఇసుకని తక్కువ ధరకి సప్లయి చేయటంలో విఫలం అయ్యారన్నారు. ఇసుక లేకపోవటం వలన ఇసుకపై ఆధార పడి పనిచేస్తున 80 లక్షల మంది రోజువారి కూలీలకు ఉపాధి లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం రేట్లు నిత్యావసర సరుకులు రేట్లు పెరగటం వలన సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక పోవటం సరైన గిటు బాటు ధర రాకపోవటం అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అని అయోమయం పరిస్థితిలలో రాష్ట ప్రజలు ఉన్నారు. సీయం గారు 2 సంవత్సరాలనుండి ఒక పరిశ్రమకు శంకుస్థాపన చేయకపోవటం దారుణమని అన్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్విరం చేయటం దీనివల్ల ప్రజలు ఆర్ధికంగా నష్టపోవటం జరిగిందన్నారు. సంక్షేమం పేరుతో సంవత్సరానికి 15 వేలు ఇస్తున్న డబ్బులు వారి అప్పులు వడ్డీకి సరిపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి లేక పరిశ్రమలు రాక ఐటి రంగం లేక ప్రజలు యువకులు పక్క రాష్ట లకు వలస వెళ్తున్నారు. సీయం జగన్ మోహన్ రేడ్డి గారి అసమర్ధత పరిపాలన వలన భవన నిర్మాణ కార్మికులు రోజు వారి కూలీలు కార్మికులు చదువుకున్న నిరుద్యోగులు రైతులు అందరు ఇబందులు పడుతున్నారు అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com