Logo
Date of Publish : 07 January 2023, 11:29 am
Editor : Sake Naresh

వైసీపీ కార్యాలయాల నిర్మాణం పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా

• సితార సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహం ఏర్పాటు అన్నారు, పార్క్ అన్నారు, ఏమయ్యాయి వైసీపీ నాయకులారా?

• రంగా కాంస్య విగ్రహం పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకున్న వైసిపి కార్పొరేటర్లు నేడు ఎక్కడ మీ మౌనం దేనికి సంకేతం?

• వైసిపి కార్యాలయ శంకుస్థాపన చేస్తే జనసేన తడాఖా ఏంటో చూపిస్తాం ఖబడ్దార్

        విజయవాడ, (జనస్వరం) : సితార సెంటర్ వద్ద స్థలాన్ని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ స్థానిక డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు, మల్లెపు విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు బొట్టు. సాయి పవన్ కళ్యాణ్, జగదీష్ సోమీ మహేష్ ప్రశాంత్ తదితరులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వైసీపీ కార్యాలయాల నిర్మాణం పేరుతో 20 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని సితార సెంటర్ వద్ద కబ్జా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, వెల్లంపల్లి శ్రీనివాస్ అని, సితార సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు, పార్క్ అన్నారు. ఏమయ్యాయి వైసీపీ నాయకులారా? అని, రంగా కాంస్య విగ్రహం పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకున్న వైసిపి కార్పొరేటర్లు నేడు ఎక్కడ మీ మౌనం దేనికి సంకేతంమని? రంగా విగ్రహం ఏర్పాటు పేరుతో సితార సెంటర్ వద్ద వైసీపీ నాయకులు కబ్జాకు తెగబడ్డారని? సితార సెంటర్ వద్ద 2000 గజాల 20 కోట్ల విలువైన భూమిని ప్రయో ప్రజా ప్రయోజనాలకు కాకుండా వైసీపీ పేరుతో వెల్లంపల్లి శ్రీనివాస్ కబ్జా చేస్తున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు కబ్జాలకి మారుపేరుగా పశ్చిమ నియోజకవర్గంలో మారిపోయిందని, కార్పొరేషన్, ఇరిగేషన్, పురావస్తు శాఖకు చెందిన వందల కోట్ల విలువైన భూములను వెల్లంపల్లి శ్రీనివాస్ ట్రస్ట్ పేరుతో కబ్జా చేశారని, ఎప్పుడైనా సరే ఆధారాలతో సహా నిరూపిస్తామని, 20 కోట్ల భూమి, 2000 చదరపు గజాలు, సంవత్సరానికి కేవలం 400 అద్దె, 33 సంవత్సరాలు లీజు దీని కబ్జా కాక మరి ఏమంటారని? కార్మిక శాఖకు చెందిన సితార ప్రధాన కూడలి వద్ద ఉన్న ఈ విలువైన స్థలాన్ని కాపాడుతాం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలాగా న్యాయపోరాటం చేస్తామని, వైసిపి కార్యాలయ శంకుస్థాపన చేస్తే జనసేన తడాఖా ఏంటో చూపిస్తాం ఖబడ్దార్ అని మహేష్ హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com