ఆలూరు ( జనస్వరం ) : కర్నూలు జిల్లాలో పాలకుల నాయకులు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. కుల మతాలు కతీతంగా సంక్షేమ పథకాలు వలన ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. అభివృద్ధి చేశామని చెప్పడం ఏమిటో విడ్డూరంగా ఉందని జనసేన వీర మహిళ ఎరుకుల పార్వతి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి జరిగి ఉంటే కొన్ని గ్రామాల నుండి వలసలు ఎందుకు వెళ్తారు. అభివృద్ధి జరిగితే వలసలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. గ్రామాల్లో నుండి ప్రజలు వలసలు వెళ్తుంటే మరి గడప గడప కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారని అన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువకులు తాపీ మేస్త్రిగా మారిపోయారు. వలసలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని కర్నూలు జిల్లాలో అధికార పార్టీ నాయకులు మాత్రం నోరు ఎందుకు మెదపడం లేదని మండిపడ్డారు. వలసలనివారణపై సమక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేకపోయారు. జిల్లాలో నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నరే తప్ప ప్రజల సమస్యలపై స్పందించడం లేదు. కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాల్లో నుండి కుటుంబాలు వలసలు వెళుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. అధికారులు మాత్రం వలసలు వెళ్ళవద్దు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో వలసలు నివారించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని ఉపాధి కల్పించే వలసలు నివారించాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com