Logo
Date of Publish : 23 November 2021, 3:04 pm
Editor : Sake Naresh

అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : అనంత జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

              గుంతకల్ ( జనస్వరం ) : వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ విమర్శించారు. గుంతకల్ మండలంలోని ధోనిముక్కల, మల్లేనిపల్లి, నెలగొండ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల వందల ఎకరాల్లో దెబ్బతిన్న వేరుశెనగ, మిరప, శనగ, కంది పంటలను పరిశీలించారు. అకాల వర్షాల వల్ల అనేక గ్రామాల్లో పంట జలమయమైంది. అతివృష్టి వల్ల వేరుశనగ, మిరప పంట పూర్తిగా కుళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది, రైతులు సర్వంకోల్పోయే పరిస్థితి ఏర్పడింది కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది. పంట చేతికొస్తుంది అనుకుంటున్నా సమయంలో అకాల వర్షం వల్ల రైతులకు కష్టము తప్ప వేరే ఏమీ మిగలలేదు కనీసం పంట పశువులకు మేతగా తినడానికి కూడా పనికి రాకుండా కుళ్లిపోయింది, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగాఉందో పొలాల్లోకి వెళ్లి చూస్తే అర్థమవుతుంది. కావున రైతుల దుస్థితిని గమనించి తక్షణం ప్రభుత్వం నష్టపోయిన రైతుకు 30 వేలు పరిహారం పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  జనసైనికులు పాండు కుమార్, నాగరాజు, సూర్యనారాయణ, అనిల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com