కాకినాడ ( జనస్వరం ) : మత్స్యకారులకు మత్స్య శాఖ అమలుచేసే సముద్రంలో చేపల వేట నిషేధం ఈనెల 15వ తేదీనుండీ అమలులోకి రాగా నేటివరకూ మత్స్యకారుల జాబితాను రూపొందించడంలో జరుగుతున్న తాత్సారంపై కాకినాడ సిటి జనసేన నగర అధ్యక్షులు సంగిసెట్టి అశోక్ మరియు పార్టీ నగర మత్సకార నాయకులు మడ్డు విజయ్ కుమార్ తదితర నాయకులు ఫిషరీస్ కార్యాలయంలో ఏ.డి ని కలిసి చర్చించారు. అసలే కరోనా దెబ్బకి ప్రజల జీవితాలు అధోగతి పాలవ్వగా, ముఖ్యంగా చేపల వేటమీదే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారుల పట్ల ఈ నిర్లక్ష్యం దారుణం అంటూ, నిషేధం మొదలైన ఇన్ని రోజులైనా అర్హుల జాబితా రూపొందించకుండా వుంటే ఇంకెప్పుడు జీవన భృతి అందచేస్తారని ప్రశ్నించారు? సహాయం అందేదాకా పేద మత్స్యకారులు పస్తులు ఉండాలా, ఇదేమి న్యాయం అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై సత్వరం చర్యలు చేపట్టి జీవన భృతి అందచేయకపోతే కాకినాడ సిటి జనసేన పార్టీ పేద మత్సకారులకు న్యాయం జరిగేదాకా ఆందోళనలు చేస్తామని తెలియచేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com