విజయనగరం ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులందరూ లోకం మాధవిని కలిసారు. గత ఐదు ఏళ్లగా వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పడుతున్న వేదనలు, సరైన సమయానికి జీతాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలుఅమలుచేయకుండా ఉండటం వంటి విషయాలు లోకం మాధవి తెలుసుకున్నారు. అలాగే CPS విధానం నుండి OPS విధానానికి మార్చేలా ఇరు పార్టీ అధినేతలకు వినతి పత్రాన్ని అందజేయాలని లోకం మాధవి గారిని ఉపాధ్యాయులు కోరారు. వినతి పత్రం అందుకున్న మాధవి గారు వారికి వారికి న్యాయం జరిగేలా వారి సమస్యను ఇరు పార్టీ అధినేతల దగ్గరికి తీసుకొని వెళ్తానని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com