Logo
Date of Publish : 10 May 2023, 2:16 pm
Editor : Sake Naresh

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు

          పి. గన్నవరం ( జనస్వరం ) : ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో  పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో అధికారులు హడావిడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. అటు గ్రామంలోని మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానిక అధికారులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ అధికారులు కూలీలుగా మారి పంటను సంచుల్లోకి ఎగుమతి చేశారు. అర్ధరాత్రి 11 గంటలకు మార్క్ ఫెడ్ అధికారుల చేత పంటను కొనుగోలు చేయించారని స్థానికులు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు తదితర అధికారులు కూలీలుగా మారడంతో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ వస్తున్నారనే భయంతో అధికారులు హడావిడి చేస్తున్నారని జనసైనికులు విమర్శిస్తున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com